ప్రకాశం జిల్లా కురిచేడులో మత్తు కోసం శానిటైజర్ సేవించి 15 మంది మృతి చెందిన ఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. మృతులు సేవించిన శానిటైజర్లు గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటలోని సీకో బయోటెక్ కంపెనీలో తయారైనట్లు సిట్ గుర్తించింది. సోమవారం రాత్రి తాడేపల్లిలోని ఆ సంస్థలో తనిఖీలు చేపట్టింది.
సీకో బయోటెక్‌లో తయారయ్యే శానిటైజర్లలో ఎలాంటి రసాయనాలు కలుపుతున్నారనే అంశంపై సిట్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి బృందం విచారణ చేపట్టింది. కంపెనీలో ఉన్న సరుకును పరిశీలించింది. నిల్వ ఉన్న శానిటైజర్లు బాక్సులను సిట్ క్షుణ్ణంగా తనిఖీ చేసింది. అక్కడి సిబ్బందిని ప్రశ్నించి.. సమాచారం సేకరించింది.