కరోనా కట్టడిలో పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ అన్నారు.గుంటూరులో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవరిస్తుందన్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటోన్మెంట్ ఏరియాలుగా ప్రకటించమన్నారు. హై అలెర్ట్‌గా ప్రకటించిన ప్రాంతాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలు ఇళ్ల వద్దే ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.
'కరోనా కట్టడిలో పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు' - కరోనాపై గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కామెంట్స్
ప్రజల స్వీయ నియంత్రణ పాటించటం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ స్పష్టం చేశారు. వైరస్‌ను నియంత్రించటంలో పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.
!['కరోనా కట్టడిలో పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు' కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6659707-971-6659707-1586005909290.jpg)
కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు