ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల నిరసన - గుంటూరు తాజా న్యూస్​

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ.. పారిశుద్ధ్య కార్మికులు గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. న్యాయపరమైన తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు.

Sanitation workers protest in front of Guntur Municipal Office
మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల నిరసన

By

Published : Jan 11, 2021, 7:13 PM IST

గుంటూరులోని పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట మెడకు ఉరి తాడు వేసుకుని నిరసన చేపట్టారు. లాక్​డౌన్ సమయంలో విధులు నిర్వహించిన పారిశుధ్య కార్మికుల పాదాలకు పాలాభిషేకం చేశారు. కరోనా సమయంలో నియమించిన కార్మికులను యధావిథిగా కొనసాగించాలని మున్సిపల్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాలరావు డిమాండ్ చేశారు. పెండింగ్​లో ఉన్న హెల్త్ బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు. మున్సిపల్ కార్మికుల పిల్లలకు జగనన్న అమ్మఒడి వర్తింపచేయాలని కోరారు. న్యాయపరమైన తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details