ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సమస్యలు పరిష్కరించకపోతే... నిరవధిక సమ్మె చేపడతాం' - గుంటూరులో పారిశుద్ద్య కార్మికుల ఆందోళన

గుంటూరు నగరపాలక సంస్థ ఎదుట మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కొవిడ్ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ద్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

గుంటూరు నగరపాలక సంస్థ ఎదుట మున్సిపల్ కార్మికులు నిరసన
గుంటూరు నగరపాలక సంస్థ ఎదుట మున్సిపల్ కార్మికులు నిరసన

By

Published : Jun 16, 2021, 7:33 PM IST

కరోనా విపత్కర పరిస్థితులలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస సదుపాయాలు కల్పించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. మున్సిపల్ కార్మికులు గుంటూరు నగరపాలక కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఒప్పంద పద్దతిలో పనిచేస్తున్న కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలని.. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని కార్మిక సంఘాలు ను ఏకం చేసి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.

ఇవీ చదవండి
Vishaka Encounter: విశాఖ మన్యంలో ఎన్​కౌంటర్.. ఆరుగురు మావోలు హతం!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details