ఏపీ సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. తమను నియమించిన గుత్తేదారు సంస్థ 3 నెలలుగా వేతనాలు చెల్లించలేదంటూ విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. సచివాలయంలో నిరసనకు దిగేందుకు యత్నించిన కార్మికులను భద్రతా సిబ్బంది బయటకు పంపడంతో వారంతా సచివాలయనికి వెళ్లే మార్గంలో బైఠాయించి నినాదాలు చేశారు.
వేతనాలు చెల్లించాలని సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన - ఏపీ సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన
తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. తమను నియమించిన గుత్తేదారు సంస్థ 3నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని వాపోయారు.
![వేతనాలు చెల్లించాలని సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన Sanitation workers protest at the secretariat to pay salaries](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8313141-254-8313141-1596690300331.jpg)
జీతాలు చెల్లించాలని సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన
గతంలో తమను పనిలో పెట్టుకున్న ఓ గుత్తేదారు సంస్థ కూడా ఒక నెల వేతనంతో పాటు ప్రావిడెంట్ ఫండ్ ను చెల్లించకుండా ఎగవేసిందని వారు ఆరోపించారు. సీఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత గుత్తేదారు సంస్థ కూడా మూడు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని తక్షణం వాటిని మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కన్నపేగు పారేసింది.. సమాజం చేరదీసింది