నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం ధర్నా నిర్వహించారు. 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వం ఇప్పటికీ గుర్తించడంలేదని గుంటూరు జిల్లా పశ్చిమ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి సాల్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్రెటరీలకు ఉద్యోగాలు కలిపించి... తమపై పెత్తనం సాగించేలా అధికారాలు ఇవ్వడం సరికాదన్నారు. పారిశుద్ధ్య కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - గుంటూరు జిల్లా
కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని... మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికులకు ఈఎస్ఐ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికుల ధర్నా