ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మున్సిపల్​ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - Sanitation workers' dharna news

గుంటూరు జిల్లా తెనాలిలో పారిశుద్ధ్య కార్మికులు.. మున్సిపల్​ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికునిపై 26వ వార్డు వైకాపా కౌన్సిలర్​, అతని అనుచరులు దాడి చేశారని కమిషనర్​కు ఫిర్యాదు చేసినట్లు సిబ్బంది తెలిపారు.

Sanitation workers' dharna
పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

By

Published : Mar 23, 2021, 9:46 AM IST

గుంటూరు జిల్లా తెనాలి 26వ వార్డు వైకాపా కౌన్సిలర్ ఇస్మాయిల్, అతని అనుచరులు కొట్టారంటూ పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించాడు. 8వ డివిజన్​లో పనిచేసే వినయ్​ అనే కార్మికుడితో.. మాట్లాడాలంటూ పిలిపించి పార్టీ కార్యాలయంలో అతనిపై దాడి చేశారని చెప్పాడు. అన్యాయంగా తమ తోటి కార్మికుడిని కొట్టారంటూ 70 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించారు.

మున్సిపల్​ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

మున్సిపల్​ కార్మికుడిపై దాడిని ఖండిస్తూ.. మారిస్​పేట నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ధర్నా చేపట్టారు. దీనిపై కమిషనర్​కు ఫిర్యాదు చేశామని కార్మికులు తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకూ.. విధులు బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:6వేల మంది ఉపాధ్యాయులకు నెలన్నరగా అందని వేతనాలు

ABOUT THE AUTHOR

...view details