ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అకస్మాత్తుగా పారిశుద్ధ్య కార్మికుడు మృతి - తెనాలిలో అకస్మాత్తుగా పారిశుద్ధ్య కార్మికుడు మృతి తాజా వార్తలు

గుంటూరు జిల్లా తెనాలిలో దుర్గాప్రసాద్ అనే పారిశుద్ధ్య కార్మికుడి మృతి కలకలం రేపింది. కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉండగా దుర్గాప్రసాద్.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు. కొద్ది రోజుల క్రితం దుర్గాప్రసాద్ కొవిడ్ టీకా తీసుకోగా.. అది వికటించిందేమోనని తోటి సిబ్బంది అనుమానిస్తున్నారు.

sanitary worker dead all of a sudden at tenali
అకస్మాత్తుగా పారిశుద్ధ్య కార్మికుడు మృతి.. కొవిడ్ టీకా వల్లేనా..?

By

Published : Mar 3, 2021, 11:12 AM IST

గుంటూరు జిల్లా తెనాలిలో దుర్గాప్రసాద్ అనే పారిశుద్ధ్య కార్మికుడు అకస్మాత్తుగా మృతిచెందాడు. కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉండగా దుర్గాప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. దుర్గాప్రసాద్ 13 రోజుల క్రితం తెనాలి ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు.

రెండు రోజులుగా అనారోగ్యంతో విధులకు దూరంగా ఉన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పడిపోవటంతో అక్కడి సిబ్బంది మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దుర్గాప్రసాద్ మృతికి కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ వికటించడం వల్ల దుర్గాప్రసాద్ మరణించారేమోనని తోటి సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details