సంగం డెయిరీలో అనిశా అధికారులు తనిఖీలు చేశారు. డెయిరీ కంప్యూటర్, సర్వర్లను పరిశీలించేందుకు యత్నించారు. తనిఖీలకు బయటి వ్యక్తులు వచ్చారని యాజమాన్యం అభ్యంతరం తెలిపింది. మార్కెటింగ్ డేటా ఉండే సర్వర్లను బయటి వ్యక్తులు తనిఖీ చేయటంపై యాజమాన్యం నిరసన తెలిపింది.
తనిఖీలకు కోర్టు అనుమతులు ఉన్నాయని.. అనిశా అధికారులు బదులిచ్చారు. బయటి వ్యక్తులతో తనిఖీ చేయిస్తే డేటా చోరీ జరగవచ్చని యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయమై అనిశా అధికారులకు.. సంగం డెయిరీ ప్రతినిధులకు మధ్య చర్చలు జరిగాయి.