ఇళ్లలో అద్దెకు దిగుతారు. యజమానులతో పరిచయం పెంచుకుని వినయం నటిస్తారు. ఆపై మత్తు మందు ఇచ్చి దోపిడీలకు పాల్పడతారు. దొరికిపోతామనుకుంటే హత్య చేయడానికి సైతం వెనుకాడరు. ఇలాంటి నేరాలకు పాల్పడుతూ.. అడ్డంగా దోచేస్తున్న గంటూరు జిల్లాకు చెందిన ఓ జంటపై హైదరాబాద్ పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు. మార్చి 3న వీరు ఆరెస్ట్ అవగా.. బయటకు వచ్చి నేరాలకు పాల్పడే అవకాశం ఉండడంతో పీడీ చట్టం ద్వారా చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్భందించారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం బీగుగొండ గ్రామానికి చెందిన గుంజి వెంకటేశ్వర్‌రావు అలియాస్ శివ (33), రొంపిచెర్ల మండలం ఇప్పర్లపల్లి గ్రామానికి చెందిన ఎస్.నాగలక్ష్మి అలియాస్ గంగ (30) దంపతులు. వారిపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పీడీ చట్టాన్ని ప్రయోగించారు. గత ఏడాది నవంబరు నుంచి ఈ ఫిబ్రవరి వరకు ఈ ఇద్దరూ రెండు దోపిడీలు, ఓ హత్యకు పాల్పడ్డారని తెలిపారు.