ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sajjala On CM Jagan: మరో రెండు విడతలు ముఖ్యమంత్రిగా జగనే ఉంటారు: సజ్జల - జగన్​పై సజ్జల కామెంట్స్

Sajjala Comments On CM Jagan: రాష్ట్రంలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వ పాలన చూస్తుంటే.. మరో రెండు విడతలు జగనే ముఖ్యమంత్రి అవుతారనిపిస్తోందన్నారు.

మరో రెండు విడతలు ముఖ్యమంత్రిగా జగనే ఉంటారు
మరో రెండు విడతలు ముఖ్యమంత్రిగా జగనే ఉంటారు

By

Published : Dec 30, 2021, 4:49 PM IST

Sajjala Comments On CM Jagan:వైకాపా ప్రభుత్వ పాలన చూస్తుంటే.. మరో రెండు విడతలు జగనే ముఖ్యమంత్రి అవుతారనిపిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్​ పాలనపై ప్రశంసలు కురిపించిన ఆయన.. రాష్ట్రంలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందన్నారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున వర్సిటీలో కంప్యూటర్ ల్యాబ్, స్పోర్ట్స్‌ హాస్టల్‌, వసతి గృహాలను సజ్జల ప్రారంభించారు.

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధి చెందాలని విద్యార్థులకు సజ్జల సూచించారు.

ఇదీ చదవండి: MINISTER PERNI NANI: నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడుపుకోవచ్చు: పేర్ని నాని

ABOUT THE AUTHOR

...view details