ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాసా పర్యటనకు ఎంపికైన గుంటూరు విద్యార్థిని - nasa tour students in guntur

ప్రతిష్ఠాత్మక నాసా పర్యటనకు గుంటూరు జిల్లాకు చెందిన సాయి పూజిత అనే విద్యార్థిని ఎంపికైంది. ఆమె స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు.

నాసా పర్యటనకు ఎంపికైన గుంటూరు విద్యార్థిని

By

Published : Sep 28, 2019, 5:02 PM IST

నాసా పర్యటనకు ఎంపికైన గుంటూరు విద్యార్థిని

గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న సాయిపూజిత అనే విద్యార్థిని ప్రతిష్ఠాత్మక నాసా పర్యటనకు ఎంపికైంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పేరొందిన నలుగురు మహనీయుల గురించి ప్రపంచవ్యాప్తంగా 826 పాఠశాలల్లో నాసా, ఫ్లోరిడా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా పరీక్ష నిర్వహించగా... మన దేశం నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. సాయి పూజిత అక్టోబర్ 1న అమెరికాలోని నాసా కేంద్రానికి వెళ్లనుంది. అక్కడ వారం రోజుల పాటు నాసా ప్రయోగాల గురించి అధ్యయనం చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఫ్లోరిడా ఇనిస్టిట్యూట్ నిర్వహించే తదుపరి పరీక్షలో రాణిస్తే ఏటా 10 వేల డాలర్ల ఉపకార వేతనం కూడా అందుతుంది. ఈ విజయంతో సాయిపూజిత రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిందని పాఠశాల డైరెక్టర్​ ఆశాలత తెలిపారు.

మంచి శాస్త్రవేత్తనవుతా...
ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే ఈ ఘనత సాధించినట్లు విద్యార్థిని సాయి పూజిత తెలిపింది. భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తను అవుతానంటోంది. ఆమెతో పాటు మరో 12 మంది విద్యార్థులు తమ సొంత ఖర్చులతో అమెరికా వెళ్లనున్నారు.

ABOUT THE AUTHOR

...view details