పేదలకు మెరుగైన వైద్యం, విద్య అందించటమే లక్ష్యంగా సహృదయ హెల్త్, మెడికల్ & ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పని చేస్తోందని డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే అన్నారు. గత మూడు సంవత్సరాలుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పబ్లిక్-ప్రయివేట్ పార్ట్నర్షిప్ద్వారా గుండె శస్త్ర చికిత్సలు చేశామన్నారు.గడువుపూర్తి కావడంతో చికిత్సలు నిలివేశామని ప్రకటించారు. చిన్న పిల్లలకు 30 గుండె శస్త్ర చికిత్సలు, 4 గుండె మార్పిడులు చేశామని వివరించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన శస్త్ర చికిత్సలు 98 శాతం విజయవంతం అయ్యాయనితెలిపారు. ప్రభుత్వం మరింత సహాయం అందిస్తే సహృదయ ట్రస్ట్ తరుపున వైద్య సేవలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.