వందలాది సహారా బాధితులు గుంటూరు రూరల్ ఎస్పీ కార్యాలయం వద్ద క్యూ కట్టారు. కూలి పనులు చేసుకుంటూ కూడబెట్టుకొన్న డబ్బులను డిపాజిట్ల పేరుతో తీసుకుని మోసం చేశారని వారు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యాక్రమంలో ఫిర్యాదు చేశారు. ఐదేళ్లలో సొమ్ము రెట్టింపు అవుతుందని చెప్పిన వారు, ఏడేళ్లు అవుతున్నా తమ సొమ్ముపై ఎవరు మాట్లాడటం లేదని ఆరోపించారు. డబ్బు దాచుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులు ఉన్నా, సహార ఏజెంట్ల మాటలు విని తాము మోసపోయామని..తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.
'5ఏళ్లలో డబ్బు రెట్టింపంటూ,సహారా మోసం చేసింది' - సహారా భాధితులు
సహార ఆర్ధిక సంస్థపై గుంటూరు జిల్లాలో వందలాది బాధితులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఐదేళ్లలో రెట్టింపు సొమ్ము వస్తుందని తమ వద్ద నుంచి డిపాజిట్లు సేకరించిన ఏజెంట్లు, ఇప్పుడు ముఖం చాటేశరని ..తమ డబ్బులు ఇప్పించాలని వారు విజ్ఞప్తులు ఇచ్చారు.
5 ఏళ్లలో డబ్బు రెట్టింపన్నారు..మోసం చేశారు