ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీ ఫోన్​కు లాక్​ పెట్టుకోవడం లేదా ఈ టిప్స్​ మీ కోసమే.. - precautions for mobile using

precautions for mobile using: పొద్దున లేవగానే ఫోన్​ ఉపయోగించడంతోనే మన దినచర్య ప్రారంభమవుతుంది. మనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు అన్ని ఫోన్​లోనే ఉంటాయి. అలాంటి ఫోన్​ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. లాక్‌ పెట్టుకోవడానికి బద్ధకించడం ప్రమాదం. పొరపాటున ఫోన్‌ చేజారిందా.. మీ వివరాలన్నీ వేరే వారి చేతికి చిక్కుతాయి. ఒక్క నిమిషం మీరు పక్కకు వెళ్లాల్సి వచ్చినా దాన్ని లాక్‌ చేయాల్సిందే! పిన్‌, పాటర్న్‌ కాదు.. పాస్‌వర్డ్‌ లేదా థంబ్‌ప్రింట్‌, ఫేస్‌ రికగ్నిషన్‌ పెట్టుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

ఫోన్ లాక్
phone lock

By

Published : Dec 21, 2022, 3:46 PM IST

precautions for mobile using: కాలక్షేపం, నగదు లావాదేవీలు, కొనుగోళ్లు.. ఒక్కటేమిటి ప్రతి పనికీ ఫోన్‌ తప్పనిసరే! ప్రపంచాన్నంతా అరచేతిలో తీసుకొచ్చిన దీనితో ప్రమాదాలూ లేకపోలేదు. అమ్మాయిలం మరింత జాగ్రత్తగా ఉండాలి. మరి ఉంటున్నారా?

తాళం వేస్తున్నారా?:లాక్‌ పెట్టుకోవడానికి బద్ధకించడం ప్రమాదం. పొరపాటున ఫోన్‌ చేజారిందా.. మీ వివరాలన్నీ వేరే వారి చేతికి చిక్కుతాయి. ఒక్క నిమిషం మీరు పక్కకు వెళ్లాల్సి వచ్చినా దాన్ని లాక్‌ చేయాల్సిందే! పిన్‌, పాటర్న్‌ కాదు.. పాస్‌వర్డ్‌ లేదా థంబ్‌ప్రింట్‌, ఫేస్‌ రికగ్నిషన్‌ పెట్టుకోమంటారు నిపుణులు. పిన్‌, పాటర్న్‌లను టెక్నాలజీతో కనిపెట్టేయొచ్చు. పాస్‌వర్డ్‌ అయితే వ్యక్తి గురించి లోతుగా తెలిస్తేనే కనిపెట్టొచ్చు. వేలిముద్ర, ఫేస్‌రీడింగ్‌ కూడా కష్టం! కాబట్టి, వీటిలో నచ్చినదాన్ని ఎంచుకోవాలట.

బయటకు రండి: కొనుగోళ్లన్నీ ఆన్‌లైన్‌లోనే. యాప్‌లేమో బోలెడు పర్మిషన్లు తీసుకుంటాయి. అంటే మన సమాచారమంతా వాళ్ల చేతిలో ఉన్నట్లే! కాబట్టి, ఏదైనా కొనుగోలు/ లావాదేవీ పూర్తవగానే లాగవుట్‌ చేయండి. ముఖ్యంగా పబ్లిక్‌ వైఫైని వాడేప్పుడు బ్యాంకు, సామాజిక మాధ్యమాల ఖాతాలు తెరవొద్దు. అత్యవసరమైతే ‘ఫైల్‌ షేరింగ్‌’ డిసేబుల్‌ చేయాలి.. లేదా ప్రైవసీ స్క్రీన్‌ పెట్టుకోవాలి. హెచ్‌టీటీపీఎస్‌ ఉన్న వెబ్‌సైట్లనే తెరవండి. బ్రౌజర్‌కి ‘హెచ్‌టీటీపీఎస్‌ ఎవ్రీవేర్‌’ జోడించుకుంటే రక్షణ వలయంగా పనిచేస్తుంది. సెట్టింగుల్లో ‘ఆటోమేటిక్‌ కనెక్ట్‌’ మీకు బాగా తెలిసిన వైఫైలకే పెట్టండి.

యాప్‌లకు పాస్‌వర్డ్‌ల సంగతేంటి?:సులువుగా ఉంటుందని అన్నింటికీ ఒకటే వాడుతోంటే తప్పు చేస్తున్నట్లే. ఒక్కోదానికి ఒక్కోటి ప్రయత్నించండి. ఏముందిలే అని తేలిగ్గా కనిపెట్టగల పాస్‌వర్డ్‌లు పెట్టొద్దు. నెలవారీ ఖర్చులు, షాపింగ్‌ లాంటివి చేశాక లెక్క చూసుకోవడం మనకు అలవాటే కదా! ఫోన్‌ విషయంలో ఆ ‘ఆడిటింగ్‌’ చేయాలి. యాప్స్‌లో సాంకేతిక లోపాలుండొచ్చు. ప్రతి యాప్‌కీ అడిగిన అన్ని ‘అనుమతులూ’ ఇవ్వొద్దు. అప్పుడప్పుడూ యాప్‌ల వివరాలు చెక్‌ చేయండి. ఏవైనా అనుమతులు అనవసరం అనిపిస్తే తొలగించండి. తరచూ వాడని యాప్‌లను తొలగిస్తే సురక్షితం, స్పేస్‌ సమస్యా ఉండదు.

పోయినా సురక్షితంగా:ఫోన్‌ తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు సాంకేతిక లోపాలను సరి చేసుకుంటూ.. మెరుగ్గా పనిచేసేలా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లు ఇస్తుంటాయి. వాటిని ఉపయోగించుకోండి. అలాగే ‘రిమోట్‌ ఆప్షన్‌’ చాలా ఫోన్లకు ఉంటుంది. దాన్ని తెలుసుకోండి. పొరపాటున ఫోన్‌ పోతే.. దాని సాయంతో ఫోన్‌లోని సమాచారాన్ని తొలగించొచ్చు. ఫోన్‌ స్మార్ట్‌ అయితే సరిపోదు.. దాని నిర్వహణలో మనమూ స్మార్ట్‌గా వ్యవహరించాలి. అప్పుడే.. సౌకర్యంతోపాటు రక్షణా!

జ్యూస్‌ జాకింగ్‌తో జాగ్రత్త:ఒకప్పుడు బయటకు అడుగు పెడుతుంటే ఫోన్‌ ఛార్జింగ్‌ ఎంతుందో చూసుకునేవాళ్లం. ఇప్పుడు చాలాచోట్ల ఛార్జింగ్‌ స్టేషన్లు/ పాయింట్స్‌ ఉంటున్నాయి. వీటితో తస్మాత్‌ జాగ్రత్త! అవి హ్యాకర్ల చేతిలో ఉండి ఉండొచ్చు. ఫోన్‌ ఏదైనా ఛార్జింగ్‌, ఫైల్స్‌ పంపాలంటే కేబులే మార్గం అవునా? హ్యాకర్లు ఛార్జింగ్‌ పాయింట్‌ పేరుతో కేబుల్స్‌ తమ డివైజ్‌లకు కనెక్ట్‌ అయ్యేలా చూస్తున్నారు. మనం మన ఫోన్‌కి దాన్ని పెట్టగానే ఫొటోలు సహా వివరాలన్నీ అవతలి వారి ఆధీనంలోకి వెళ్లిపోతాయి. దీన్నే ‘జ్యూస్‌ జాకింగ్‌’ అంటారు.

దీని బారిన పడ కూడదంటే ఇంట్లో, లేదా కారులో మాత్రమే ఛార్జింగ్‌ పెట్టుకోండి. తప్పనిసరి అయితే వాల్‌ సాకెట్‌లకు ఉన్న వాటినో, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ విధానాలనో ఉపయోగించండి. లేదూ పవర్‌ బ్యాకప్‌లను వెంట తీసుకెళ్లండి. బయట తప్పనిసరై ఛార్జింగ్‌ చేస్తుంటే ఆ సమయంలో ఫోన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడద్దు. ఇంకా ఇతర డివైజ్‌లకు కనెక్ట్‌ అవ్వాలంటే పాస్‌వర్డ్‌ తప్పనిసరి చేసుకోండి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details