ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Complaint: వాళ్లపై పోలీసులకు సచివాలయ అడ్మిన్ ఫిర్యాదు...అసలేం జరిగింది? - వార్డు వాలంటీర్లు, వైకాపా ఇంఛార్జ్​లపై నర్సరావుపేటలో సచివాలయ అడ్మిన్ ఫిర్యాదు

ఇద్దరు వార్డు వాలంటీర్లు, మరో ఇద్దరు వైకాపా వార్డు ఇంఛార్జ్​లపై.. గుంటూరు జిల్లా నరసారావుపేట సచివాలయ అడ్మిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఉద్యోగపరమైన వేధింపులకు గురిచేస్తున్నారంటూ అడ్మిన్ బిందు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నలుగురిని విచారించారు.

sachivalaya admin complaints on ward volunteers and ycp incharges for harassaing her at narsaraopeta
వార్డు వాలంటీర్లు, వైకాపా ఇంఛార్జ్​లపై సచివాలయ అడ్మిన్ ఫిర్యాదు

By

Published : Oct 24, 2021, 3:47 PM IST


ఇద్దరు వార్డు వాలంటీర్లు, మరో ఇద్దరు వైకాపా వార్డు ఇంఛార్జ్​లపై ఓ సచివాలయ అడ్మిన్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగింది. 6వ వార్డులో సచివాలయ అడ్మిన్​గా బిందు విధులు నిర్వహిస్తోంది. అదే వార్డులో వాలంటీర్లుగా పనిచేస్తున్న రవి, రాజు అనే ఇద్దరు వ్యక్తులు.. 3, 6 వార్డుల వైకాపా ఇంఛార్జ్ లు జాఫర్, శిలార్​ల ప్రోద్బలంతో.. తనను ఉద్యోగపరమైన వేధింపులకు గురి చేస్తున్నారంటూ స్థానిక రెండో పట్టణ పోలీసులకు బిందు ఫిర్యాదు చేశారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు.. రెండో పట్టణ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇద్దరు వైకాపా వార్డు ఇంచార్జ్ లను అదుపులోకి తీసుకోవడంతో.. పట్టణంలోని వైకాపా శ్రేణులు కొందరు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు ఇరుపక్షాలను విచారించి పంపించారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. ఫిర్యాదుపై మరింత దర్యాప్తు చేసి వివరాలు తెలియజేస్తామని.. నరసరావుపేట రెండో పట్టణ సీఐ వెంకట్రావు తెలిపారు.

ఇదీ చదవండి:

CASH SEIZED: పంచలింగాల చెక్​పోస్ట్​ వద్ద భారీగా నగదు పట్టివేత..ఎంతంటే..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details