RBK Closed: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు, కుర్నూతులలో 15 రోజులుగా రైతు భరోసా కేంద్రాలు మూసివేశారు. వట్టిచెరుకూరు రైతు భరోసా కేంద్రానికి 22 నెలలు, కుర్నూతల రైతు భరోసా కేంద్రానికి 7 నెలల నుంచి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు తాళాలు వేశారు. దీంతో రైతు భరోసా కేంద్రాల సిబ్బంది సచివాలయాలలో కూర్చుంటున్నారు. ఎన్నాళ్ళు అద్దె డబ్బులు అడగాలని వ్యవసాయ సిబ్బందిపై ఇంటి యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల రేపు, వారంలో చెల్లిస్తామని అధికారులు మాటలు చెప్తున్నారే తప్పా.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటున్నారు ప్రభుత్వం కనీసం అద్దె చెల్లించకపోతే ఎలాగని ఆగ్రహం చెందారు.
అద్దె చెల్లించలేదని.. రైతు భరోసా కేంద్రాలకు తాళం - రైతు భరోసా కేంద్రాలకు తాళాలు
RBK Closed: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు రైతు భరోసా కేంద్రానికి 22 నెలలు, కుర్నూతల రైతు భరోసా కేంద్రానికి 7 నెలల నుంచి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు తాళాలు వేశారు. ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో ఈ రైతు భరోసా కేంద్రాలను 15 రోజులుగా మూసివేశారు.
రైతు భరోసా కేంద్రాలకు తాళాలు