ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

rythu bharosa kendram: చెప్పేవన్నీ గొప్పులు.. ఆర్బీకేల్లో రైతులకు అందని సేవలు - RBK

Rythu Bharosa Centres: 'విత్తనం నుంచి పంట విక్రయ కేంద్రం వరకు.. అంతా ఆర్బీకేలే చూసుకుంటాయి.. రైతుల్ని చేయి పట్టి నడిపిస్తాయి’ అని సీఎం జగన్‌ తరచూ గొప్పలు చెబుతూ ఉంటారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాయంటూ భుజాలు చరుచుకుంటున్నారు. వాస్తవానికి ఆర్బీకేలు ఏర్పాటు చేసి రెండున్న సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ అధిక శాతం సేవలు అందని పరిస్థితి ఉంది. సౌకర్యాల కల్పనపై అసలు పట్టించుకోవడం లేదు. ప్రైవేటు భవనాల్లో ఉన్న వాటికి రెండు సంవత్సరాలుగా అద్దె కట్టడం లేదు. దీంతో యజమానులు తాళాలేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది. 6854 పోస్టులు ఖాళీగా ఉన్నా.. భర్తీ చేయడం లేదు.

rythu bharosa centres
రైతు భరోసా కేంద్రాలు

By

Published : Jun 2, 2023, 10:40 AM IST

Rythu Bharosa Centres: రైతు భరోసా కేంద్రాల గురించి సీఎం జగన్ గొప్పగా చెప్తున్నారు కానీ ఆచరణకొస్తే మాత్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అనే పరిస్థితి కనిపిస్తోంది. ఆర్బీకేల ఏర్పాటు ద్వారా 22 రకాల సేవలను గ్రామస్థాయిలో అందుబాటులోకి తెచ్చామని వైసీపీ ప్రభుత్వం చెబుతున్నా.. అందులో మూడింట ఒక వంతు కూడా సక్రమంగా అందించలేక పోతున్నామనే విషయాన్ని విస్మరిస్తోంది. రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగుమందులేవీ ఆర్బీకేల్లో దొరకని పరిస్థితి నెలకొంది.

క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణనే ప్రభుత్వం గాలికొదిలేసింది. రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బందికి యాప్‌ల్లో వివరాల నమోదు, ఇతర పనులను అప్పగిస్తోంది. దీంతో రైతులకు వ్యవసాయ సలహాలు, సూచనలు ఇవ్వలేకపోతున్నారు. అన్నింటికీ ఆర్బీకే అని గొప్పలు చెప్పడమే కానీ.. అక్కడ ఏమీ దొరకవు. ఈ-క్రాప్‌ ఒక్కటే నమోదు చేస్తారని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బదిలీ హడావుడి మొదలు కావడంతో.. అధిక శాతం సిబ్బంది కార్యాలయాలు వదిలి, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారని రైతులు చెబుతున్నారు.

CBN: రైతులను పరామర్శించే తీరిక లేదా జగన్​..? వాళ్లు కష్టాల్లో ఉంటే పారిపోతావా..!: చంద్రబాబు

రాష్ట్రంలో మొత్తం ఆర్బీకేలు 10 వేల 778 ఉన్నాయి. వీటిలో నిర్మాణం ప్రారంభించినవి 8 వేల327 కాగా.. పూర్తయినవి 16 వందల మాత్రమే. మిగతా వాటిలో చాలా వరకు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. అద్దె భవనాల్లోని ఆర్బీకేల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రెండేళ్ల నుంచి 30 కోట్ల రూపాయలకు పైగా అద్దె బకాయిలు పేరుకుపోవడంతో భవన యజమానులు ఆర్బీకేలకు తాళాలు వేస్తున్నారు. ఆర్బీకేలు అద్భుతమంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం.. పట్టుమని 30 కోట్ల బకాయిలూ చెల్లించలేకపోతోంది.

ఎరువుల నిల్వకు తీసుకున్న గోదాములకూ అద్దెలు చెల్లించడం లేదు. దీంతో వాటి యజమానులు అద్దెకు సరిపడా ఎరువుల బస్తాలు తీసుకెళ్లిపోతున్నారని.. వ్యవసాయ సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఒక్కో వ్యవసాయ సహాయకుడు 2, 3 ఆర్బీకేల్లో ఇంఛార్జ్ బాధ్యతలు చూడాల్సి వస్తోంది. పశుసంవర్థకశాఖ సహాయకులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో చాలా చోట్ల గోపాలమిత్రల సేవలను ఉపయోగించుకుంటున్నారు.

ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం

అయినా పూర్తిస్థాయిలో సేవలందడం లేదు. ఉద్యానశాఖ సహాయక పోస్టులనూ భర్తీ చేయడం లేదు. దీంతో నామమాత్ర సేవలకే పరిమితమవుతున్నాయి. పశుసంవర్థక శాఖలో 4 వేల 656, ఉద్యానశాఖలో 16 వందల 44, వ్యవసాయ శాఖలో 467, మత్స్య శాఖలో 64, పట్టు శాఖలో 23 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. ఆర్బీకేల్లో ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, ఇతర ఉత్పత్తులన్నీ ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పడమే తప్ప అవేవీ అందుబాటులో ఉండవు.

ప్రతి గ్రామంలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉంటే రైతులకు కష్టం తగ్గుతుంది. అయితే ఎక్కువ శాతం రైతు భరోసా కేంద్రాల్లో సరిపడా నిల్వలే ఉండటం లేదు. రాష్ట్రంలో గతేడాది 3.77 లక్షల టన్నుల ఎరువులు మాత్రమే రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించారు. రైతు భరోసా కేంద్రాలకు సరఫరా పేరుతో సహకార పరపతి సంఘాలకు కేటాయింపులో ప్రభుత్వం కోత పెడుతోంది. దీంతో రైతులకు సొసైటీల్లోనూ ఎరువులు దొరకని పరిస్థితి నెలకొంది. రైతు భరోసా కేంద్రాల పేరు చెబితేనే వ్యాపారులు ఉలిక్కిపడుతున్నారు.

యూరియా కొరత.. అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులు

వాటికి పురుగుమందులు సరఫరా చేస్తే ఎప్పుడు డబ్బులిస్తారో తెలియదని భయపడుతున్నారు. చేసేది లేక రైతులు అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో కొనుక్కుంటున్నారు. గ్రామాల వారీగా పంటల సాగు, వాటికి అవసరమయ్యే విత్తన రకాలను గుర్తించి రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయడం గురించి పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా ఇచ్చిన కాసిన్ని కూడా అధికార పార్టీకి చెందిన వారికే అందుతున్నాయి. రైతులు నల్లబజారులో అధిక ధరలకు కొనుక్కొంటున్నారు ఆర్బీకేల్లో కనీసం స్టేషనరీ అందుబాటులో లేదు.

అంతెందుకు? పశుసంవర్థక సహాయకులకు రెండేళ్లుగా మందుల సరఫరాయే లేదు. రాయితీపై అద్దె యంత్ర కేంద్రాలను అధికార పార్టీకి చెందిన రైతు సంఘాలకే దక్కుతున్నాయి. నలుగురు సభ్యుల పేర్లతో సంఘాన్ని ఏర్పాటు చేసి రాయితీపై పరికరాలు తీసుకున్నా.. వాటిని వైసీపీ నేతలే సొంత అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలో 6 వేల500 ఆర్బీకేల పరిధిలో అద్దె యంత్ర కేంద్రాలకు వ్యవసాయ ఉపకరణాలను అందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే 90శాతం కేంద్రాల్లో అవి రైతులకు ఉపయోగపడటం లేదు.

ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతల అవస్థలు..

రాష్ట్రంలోని 9 వేల 277 రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకు మిత్ర, బిజినెస్‌ కరస్పాండెంట్ల ద్వారా బ్యాంకింగ్‌ సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు పోతోంది. క్షేత్రస్థాయిలో రెండు శాతం కేంద్రాల్లోనూ అలాంటి సేవలు అందవు. బ్యాంకులతో సమన్వయలోపాన్ని చక్కదిద్దే పరిస్థితి లేదు. వాతావరణ సమాచారం, మార్కెట్‌ ధరలు తెలుసుకోవడంతో పాటు విత్తనాలు, ఎరువులు తదితర ఉత్పత్తులను బుక్‌ చేసుకునేందుకు కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. వాటికి ఇంటర్నెట్‌ సౌకర్యం లేదు. సహాయకుల మొబైల్‌ ఫోన్ల నుంచే కనెక్ట్‌ చేసుకోవాలి. దీంతో రోజులో 10 నిమిషాలు ఆన్‌ చేసి తర్వాత ఆపేయండని కొందరు అధికారులే చెప్తున్నారు.

rythu bharosa kendram: చెప్పేవన్నీ గొప్పులు.. ఆర్బీకేల్లో రైతులకు అందని సేవలు

ABOUT THE AUTHOR

...view details