గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం రెడ్ జోన్ ప్రాంతంలో గ్రామీణ ఎస్పీ విజయారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ తీసుకున్న చర్యలు, చేపట్టిన జాగ్రత్తలను పరిశీలించారు. రెడ్ జోన్ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని గుంటూరు గ్రామీణ ఎస్పీ కోరారు.
రెడ్ జోన్ ప్రాంతంలో గ్రామీణ ఎస్పీ పర్యటన - red zone in chilakaluripeata
చిలకలూరిపేట పట్టణం రెడ్ జోన్ ఏరియాలో గ్రామీణ ఎస్పీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ తీసుకున్న చర్యలు, చేపట్టిన జాగ్రత్తలను పరిశీలించారు .
![రెడ్ జోన్ ప్రాంతంలో గ్రామీణ ఎస్పీ పర్యటన guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7354782-751-7354782-1590493444285.jpg)
చిలకలూరిపేట పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు మరొకటి నమోదు కావడంతో ఆ ప్రాంతమంతా రెడ్ జోన్ గా ప్రకటించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడి పరిస్థితులను గమనించి.. చేపట్టాల్సిన చర్యలను నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి, చిలకలూరిపేట అర్బన్ సీఐ సూర్యనారాయణలకు వివరించారు. ప్రజలందరూ ఇళ్లలో నుంచి బయటకు రాకుండా కొద్ది రోజులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇది చదవండి పోలీస్ సిబ్బందికి ఎన్-95 మాస్కులు అందించిన ఉదయ్ ఇన్ఫ్రా