ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థులకు కరోనా సోకినట్లు పుకార్లు.. ఖండించిన ప్రధానోపాధ్యాయురాలు - corona rumors latest news

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కరోనా సోకినట్లు వస్తున్న పుకార్లను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొట్టిపారేశారు. అవన్నీ అవాస్తవాలని వాటిని ఎవరూ నమ్మవద్దని అన్నారు.

zphs piduguralla
పిడుగురాళ్ల ప్రభుత్వ పాఠశాల

By

Published : Mar 4, 2021, 12:04 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కరోనా సోకినట్లు వస్తున్న వార్తల్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మి ఖండిచారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ విద్యార్థులకు కరోనా వచ్చినట్లు వదంతులు వ్యాపింపచేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొందరు విద్యార్థుల పేర్లు కూడా చెబుతున్నారని.. వారి తల్లి దండ్రులను ప్రశ్నిస్తే అన్నీ పుకార్లుగానే తేలినట్లు చెప్పారు. ఇలాంటి వదంతులతో పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం తగ్గుతోందని అన్నారు. తల్లిదండ్రుల, విద్యార్థుల మనోభావాలను పుకార్లు దెబ్బతీసే అవకాశం ఉందని ఆందోళన చెందారు. ఇలాంటి దుష్ప్రచారం సరి కాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details