గుంటూరులో వ్యాపారి కబ్బారావు ఇంటిపై కొంత మంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.ఈ దాడికి ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తోంది.బాధితుడు కబ్బారావు,వ్యాపారి శ్రీనివాసరావు మధ్య ఆర్థిక వివాదం నెలకొనగా,విషయం కోర్టు పరిధిలో ఉంది.ఈ క్రమంలో బాధితుడు నివాసముండే బ్రాడీపేటలోని వైట్ ఫీల్డ్ ఆపార్ట్‌మెంట్స్‌కు వచ్చిన సుమారు50మంది,ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు.అడ్డుకున్న వారిపై దాడికి దిగారని బాధితుడు ఆరోపించాడు.మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని బాధితులు ఆరోపించారు.తాము ఎమ్మెల్యే మనుషులమంటూ తక్షణం ఇల్లు వదిలేసి వెళ్లకుంటే చంపుతామని బెదిరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.ఘటనపై పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు.వారు కేసు నమోదు చేయకపోగా కనీసం రక్షణ కూడా కల్పించడం లేదని ఆరోపించాడు.
ఇదీచదవండి
ఎమ్మెల్యే మనుషులమంటూ..వ్యాపారి ఇంటిపై దాడి! - ycp attacks news
ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదంలో కొంతమంది వ్యక్తులు తన ఇంటిపై దాడి చేసి విధ్వంసానికి దిగారని బ్రాడీపేటలో నివాసముంటున్న వ్యాపారీ కబ్బారావు ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగినట్లు ఆయన ఆరోపించారు.

వ్యాపారి కబ్బారావు ఇంటిపై
వ్యాపారి కబ్బారావు ఇంటిపై ఎమ్మెల్యే మనుషులమంటూ దాడి