కరోనా భయంతో తాము విధులకు రాలేమని ఆర్టీసీ కార్మికుడు.. అధికారుల కాళ్లపై పడిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగింది. పిడుగురాళ్ల డిపోలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే అధికారులు మాత్రం ఉద్యోగులందరినీ విధులకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఆరోగ్యం గురించి అధికారులు ఆలోచించకుండా విధులకు రమ్మనటాన్ని ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. 'మీ కాళ్లు పట్టుకుంటాం.. సెలవులు పెట్టుకునేందుకు అవకాశం కల్పించండి' అంటూ డిపో మేనేజర్ కాళ్లపై పడ్డాడు. గ్యారేజిలో పని చేస్తోన్న మరో ఉద్యోగి సైతం ఇదే తరహాలో డిపో మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆరోగ్య భద్రత దృష్ట్యా అధికారులు.. శానిటైజర్లు, మాస్కులు కూడా అందుబాటులో ఉంచలేదని, ఈ పరిస్థితుల్లో ఎలా పని చేయాలని నిలదీశారు.
విధులకు రాలేమంటూ.. డిపో మేనేజర్ కాళ్లపై పడ్డ ఆర్టీసీ కార్మికుడు - పిడుగురాళ్ల నేటి వార్తలు
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో అమానవీయ ఘటన జరిగింది. పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఓ వ్యక్తికి కరోనా సోకడంతో.. తాము విధులకు రాలేమంటూ సహ ఉద్యోగులు డిపో మేనేజర్ కాళ్లపై పడ్డారు. తమ ఆరోగ్యానికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
విధులకు రాలేమంటూ.. డిపో మేనేజర్ కాళ్లపై పడ్డ ఆర్టీసీ కార్మికుడు