ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న అధికారులు - Officers educate drivers about corona news

కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన డ్రైవర్లకు కరోనా సోకిన నేపథ్యంలో రవాణాశాఖ అప్రమత్తమైంది. సరకు రవాణా చేసే డ్రైవర్లు కరోనా వ్యాధి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గుంటూరు ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్ అవగాహన కల్పించారు.

Rtc  Officers educate drivers about corona
డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

By

Published : May 16, 2020, 9:45 PM IST

కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన డ్రైవర్లకు కరోనా సోకిన నేపథ్యంలో రవాణాశాఖ అప్రమత్తమైంది. సరకు రవాణా చేసే డ్రైవర్లు కరోనా వ్యాధి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గుంటూరు ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్ అవగాహన కల్పించారు. వాహనం క్యాబిన్‌ తరుచూ ముట్టుకునే స్టీరింగ్, ఆడియో సిస్టం, డోర్ హ్యాండిల్స్‌తోపాటు ఇతర పనిముట్లను సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరుచుకోవాలని సూచించారు. డ్రైవర్, క్లీనర్ తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజ్‌లు వాడాలన్నారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని... వాహనం దిగి కిందకు వచ్చినప్పుడు తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని చెప్పారు. రవాణాశాఖ తరపున మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్, సబ్బుతో కూడిన కిట్లు అందజేస్తామన్నారు.

ఇదీ చదవండి:

నిర్దేశిత ప్రమాణాలను రూపొందించండి: సీఎం జగన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details