ఉద్యోగులను అవహేళన చేసి, మనోభావాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ.. వినుకొండ ఆర్టీసీ ఎస్టీఐ వెంకట్రావును సస్పెండ్ చేయాలని గుంటూరు జిల్లా వినుకొండ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. బస్టాండ్ ఎదుట ఉద్యోగులు.. ఎన్‌ఎమ్‌యూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా సెలవడిగిన ఉద్యోగిని కించపరుస్తూ... అవహేళనగా మాట్లాడారంటూ తీవ్రంగా ఖండించారు. వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని డీఎంకు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.
'అవహేళన చేస్తూ మాట్లాడిన ఆర్టీసీ ఎస్టీఐను సస్పెండ్ చేయాలి' - concern in guntur district
గుంటూరు జిల్లా వినుకొండలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేశారు. తమను అవహేళన చేస్తూ మాట్లాడిన ఆర్టీసీ ఎస్టీఐ వెంకట్రావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
!['అవహేళన చేస్తూ మాట్లాడిన ఆర్టీసీ ఎస్టీఐను సస్పెండ్ చేయాలి' rtc employes protest in vinukonda guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11241059-37-11241059-1617283392902.jpg)
వినుకొండలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన