RTC Employees Letter To RTC MD: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్ నేతలు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావుకు లేఖ రాశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ గుర్తింపు ఆధారంతో హాజరు వేసే పద్ధతి నుండి మినహాయింపు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రధాన ఉద్యోగ సంఘం ఎంప్లాయిస్ యూనియన్ కోరింది. ఆర్టీసీ ఉద్యోగులు విధులు 24గంటలపాటు అంకిత భావంతో పని చేస్తుంటారని వీరికి ఆర్టీసీ ఉద్యోగులు రోజుకు 8 గంటల కంటే అదనంగా పనిచేసే పరిస్ధితులున్నాయని చెప్పారు.
మాకు మినహాయింపు ఇవ్వండి.. ఆర్టీసీ ఎండీకి ఉద్యోగుల లేఖ
RTC Employees Letter To RTC MD: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ గుర్తింపు ఆధారంతో హాజరు వేసే పద్ధతి నుండి మినహాయింపు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రధాన ఉద్యోగ సంఘం ఎంప్లాయిస్ యూనియన్ కోరింది. ఈ మేరకు యూనియన్ నేతలు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావుకు లేఖ రాశారు. ముఖ గుర్తింపు హాజరు విధానం వల్ల ఆర్టీసీ సిబ్బంది అవస్థలు పడుతున్నారని తెలిపారు.
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల లేఖ
పది నిమిషాలు ఆలస్యంగా వస్తే గైర్హాజరుగా పరిగణించడం, పని గంటలు నిర్ణయించడం సరైంది కాదన్నారు. చాలామంది ఆర్టీసీ సిబ్బంది వద్ద ఆండ్రాయిడ్ పోన్లు లేవని, ఉన్నవారిలో కూడా కొంతమందికి ఇలాంటి టెక్నాలజీ ఎలా వినియోగించాలో తెలియని పరిస్దితి అని లేఖలో నేతలు తెలిపారు. ముఖగుర్తింపు హాజరు ఇబ్బందులపై చర్చించేందుకు సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని.. ఈ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేలా ప్రభుత్వంతో చర్చించాలని ఎండీని యూనియన్ నేతలు కోరారు.
ఇవీ చదవండి: