బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు.. తప్పిన ప్రమాదం - DRIVER
విధుల్లో ఉండగా ఆర్టీసీ బస్సు చోదకుడు గుండెపోటుకు గురయ్యాడు. బస్సు పొలాల్లోకి దూసుకెళ్లడంతో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి
బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు
గుంటూరు జిల్లా దాచేపల్లి నుండి తంగెడ గ్రామానికి వెళుతుండగా.. బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది.దీంతో బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. బస్సులోని ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులు, డ్రైవర్‌ను స్థానికులు హుటాహుటిన దాచేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి పర్వాలేదని వైద్యులు తెలిపారు.