ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాపై పోరుకు ఆర్టీసీ, రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు - కరోనా తాజా వార్తలు

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆర్టీసీ, రైల్వే శాఖలు అప్రమత్తమయ్యాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరిశుభ్రతపై మరింత దృష్టి సారించారు.

carona alert
carona alert

By

Published : Mar 21, 2020, 7:50 PM IST

కరోనాపై పోరుకు ఆర్టీసీ, రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు

ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా వైరస్.... మన రాష్ట్రంలోనూ నెమ్మదిగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో జన సమూహం అధికంగా ఉండే రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. గుంటూరు నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బులు అందుబాటులో ఉంచారు. ప్రయాణికులు కూర్చొనే కుర్చీలను ఎప్పటికప్పుడు సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేయిస్తున్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా అత్యవసర సర్వీసులు మినహా బస్సులు నిలిపివేస్తామని గుంటూరు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాఘవకుమార్ చెప్పారు.

రైల్వేస్టేషన్లలోనూ కరోనా నివారణ చర్యలు వేగవంతమయ్యాయి. ముఖద్వారం వద్దే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తూ ప్రయాణికులను అనుమతిస్తున్నారు. పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో స్టేషన్​ను శుద్ధి చేస్తున్నారు. సిబ్బంది మాస్కులు, గ్లౌజులు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి కరోనాపై ప్రయాణికులకు వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా గుంటూరు నుంచి బయలుదేరే బస్సులు, రైళ్లను దాదాపుగా నిలిపివేయాలని అధికారులు యోచిస్తున్నారు.

ఇదీ చదవండి:కరోనా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details