ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రవాణా అధికారుల తనిఖీలు .. 106 ప్రైవేటు బస్సులపై కేసు నమోదు - గుంటూరు వార్తలు

గుంటూరు జిల్లాలో రవాణా అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేశారు.

private travels
రవాణా అధికారుల తనిఖీలు .. 106 ప్రైవేటు బస్సులపై కేసు నమోదు

By

Published : Jan 13, 2021, 4:22 PM IST

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల అంతర్ రాష్ట్ర రవాణా చెక్ పోస్ట్ వద్ద రాష్ట్ర వ్యాప్త స్పెషల్ డ్రైవ్​లో భాగంగా ఆర్​టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 106 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేసి.. రూ.3లక్షల అపరాధ రుసుం విధించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్న ప్రైవేటు బస్సు యాజమాన్యాలు వారి జాబితా ఇవ్వకుండా అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయని ఆర్​టీఏ చెక్​పోస్ట్​ ఇన్​ఛార్జ్​ జంగాల అనిల్​ కుమార్​ అన్నారు. నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులపై జిల్లా అధికారుల సూచనలతో కేసులు నమోదు చేసి సీజ్ చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో చెక్ పోస్ట్ అధికారులు స్వప్నిల్ రెడ్డి, రఘవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details