ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో రూ. 25 లక్షల విలువైన మద్యం డంప్ స్వాధీనం - గుంటూరులో మద్యం డంప్ స్వాధీనం

గుంటూరు జిల్లా వెల్దుర్తిలో భూమిలో దాచిన మద్యం డంప్​ను అధికారులు గుర్తించారు. జేసీబీల సాయంతో మద్యం కేసులను వెలికితీసిన అధికారులు.. మద్యం విలువ రూ. 25 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మద్యం డంప్ స్వాధీనం
మద్యం డంప్ స్వాధీనం

By

Published : Oct 16, 2020, 8:01 PM IST

గుంటూరు జిల్లాలో భారీ మద్యం డంప్ పట్టుబడింది. వెల్దుర్తి మండలం ఉప్పలపాడులో ఓ కోళ్ల ఫారం సమీపంలో మద్యం డంప్​ని ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు వెలికితీశారు. జేసీబీల సాయంతో తవ్వి...భూమిలో దాచి ఉంచిన 25లక్షల విలువైన మద్యాన్ని బయటకు తీశారు. గురువారం వెల్దుర్తిలో చిన్నపాటి మద్యం డంప్​ని ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత నిందితులను విచారించే క్రమంలో ఉప్పలపాడులోని డంప్ విషయం బయటపడింది. దీంతో మరికొన్ని చోట్ల ఇలాంటి డంపులు ఉంటాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.

పట్టుబడిన మద్యం సీసాలు మహారాష్ట్ర నుంచి తెచ్చినట్లుగా గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో సరకుని రెండు రాష్ట్రాలు దాటించి తీసుకురావటంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. లాక్​డౌన్ సమయంలోనే సరకు వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. రాజకీయ పార్టీ నేతల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు కావాల్సిన బ్రాండ్లు లభించటం లేదు. దీంతో ఇతర రాష్ట్రాల మద్యానికి డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్​ మద్యం మాఫియాకు అవకాశంగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువచ్చి ఇక్కడ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details