ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ. 12 లక్షల విలువైన గోవా మద్యం పట్టివేత - గుంటూరులో గోవా మద్యం పట్టివేత

రూ. 12 లక్షల విలువైన గోవా మద్యాన్ని ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్ పోలీసులు గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చీమలమర్రు వద్ద స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న లారీని సీజ్ చేసి..ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

గోవా మద్యం పట్టివేత
గోవా మద్యం పట్టివేత

By

Published : Dec 17, 2020, 10:52 PM IST

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చీమలమర్రు వద్ద ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్ పోలీసులు భారీగా గోవా మద్యాన్ని పట్టుకున్నారు. నరసరావుపేట ఎక్సైజ్ సూపరిండెంట్ చంద్రశేఖరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...మినీ లారీలో అక్రమంగా గోవా మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో వాహన తనిఖీలు చేపట్టి మద్యాన్ని గుర్తించామన్నారు. 100 కేసుల్లో 12 లక్షల విలువ చేసే 2,640 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న గుంటూరు జిల్లా ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ అశోక్, ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన మరో నిందితుడు శ్యామ్ ప్రసాద్​లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. మరో ఇద్దరు నిందితులు కొచ్చర్లకు చెందిన రమేష్, ప్రకాశం జిల్లా కామేపల్లికి చెందిన నరేశ్​లు పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వారి కోసం గాలింపుచర్యలు చేపట్టామన్నారు.

ABOUT THE AUTHOR

...view details