గుంటూరు జిల్లా మంగళగిరిలోని 18వార్డులో నీటి పన్ను వసూలు చేసేందుకు పురపాలక సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నీటి పన్ను వసూలు చేసేందుకు వచ్చిన ప్రభుత్వ సిబ్బందిపై ఓ వ్యక్తి దాడికి దిగాడు. వార్డులోని రౌడీషీటర్ పొట్లాబత్తుని శివ అనే ఇంటికి వెళ్లిన సిబ్బంది.. 10వేల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని సూచించారు. లేకపోతే కుళాయి కట్టేస్తామని హెచ్చరించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన రౌడీషీటర్ పురపాలక సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. రోడ్డు పక్కనే ఉన్న నాపరాయి తీసుకొని ఓ ఉద్యోగిపై విరుచుకుపడ్డాడు. సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితుడిని అదుపులోకి తీసుకొని, దర్యాప్తు చేపట్టారు.
నీటి పన్ను చెల్లించమంటే.. ప్రభుత్వ సిబ్బందిపై రౌడీషీటర్ దాడి
నీటి పన్ను వసూలు చేసేందుకు వచ్చిన ప్రభుత్వ సిబ్బందిపై గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి రాళ్లతో దాడికి యత్నించాడు. బకాయిలు కట్టాలని అధికారులు ఆదేశించగా ఆగ్రహించిన రౌడిషీటర్ వారిపై దాడికి దిగాడు.
ప్రభుత్వ సిబ్బందిపై రౌడీషీటర్ దాడి