ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దేవాలయ భూముల పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం' - గుంటూరు మత పెద్దల సమావేశం న్యూస్

దేవాలయ భూములను అన్యాక్రాంతం చెయ్యటానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ ఆరోపించారు. గుంటూరులోని అన్ని మతాల పెద్దలతో స్థానికంగా ఉన్న ఓ కల్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.

Round Table meeting in Guntur with all religions

By

Published : Nov 9, 2019, 8:31 PM IST

మత పెద్దలతో గుంటూరులో రౌండ్​ టేబుల్​ సమావేశం

దేవాలయ భూములను అన్యాక్రాంతం చెయ్యటానికి ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ ఆరోపించారు. గుంటూరులోని మత పెద్దలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. తిరుపతి దేవస్థానంలో స్వామి వారి విశ్వాసాలను కాపాడే వారినే అక్కడ నియమించాలని... అన్యమతస్థులను వేరే శాఖలకు బదిలీ చేయాలన్నారు. ప్రభుత్వ ఉన్నత పదవిలో ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని మరొక శాఖకు బదిలీ చేయడం దారుణమన్నారు. దేవాదాయ భూముల పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని మతాల వారికి ఉన్నటువంటి ఆస్తులను రక్షించేందుకు ప్రభుత్వం ఓ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎస్సీ మహానాడు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోళ్ల అరుణ్​ కుమార్ డిమాండ్ చేశారు. దీనిపై అన్ని మతాల పెద్దలతో కలసి పోరాటం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details