బీసీల రిజర్వేషన్ల అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గుంటూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన, తెదేపా నేతలు పాల్గొన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తోందని జనసేన నాయకుడు శ్రీనివాస్ ఆరోపించారు. వైకాపా నాయకులే న్యాయస్థానానికి వెళ్లి రిజర్వేషన్లు అడ్డుకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు వైకాపాకు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. ఈ ఎన్నికలలో జనసేన పార్టీ.. బీసీలకు 34 శాతం మేర రిజర్వేషన్లు కల్పిస్తుందని ప్రకటించారు.
అఖిలపక్షం ఆధ్వర్యంలో గుంటూరులో రౌండ్‌టేబుల్ సమావేశం - janasena
బీసీల రిజర్వేషన్ల అంశం విషయంలో ప్రభుత్వ వైఖరిపై గుంటూరులో జనసేన, తెదేపా నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. వైకాపా ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
అఖిలపక్షం ఆధ్వర్యంలో గుంటూరులో రౌండ్‌టేబుల్ సమావేశం