ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేసిన రోటరీ క్లబ్ - tenali roatary club distribute ppe kits

గుంటూరు జిల్లా తెనాలిలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురానికి చెందిన నూతన కార్యవర్గ నియామక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కరోనా బాధితులకు సేవలు చేస్తున్న వైద్యులకు పీపీఈ కిట్లు అందజేశారు.

roatary club
తెనాలి వైద్యలుకు పీపీఈ కిట్లు అందజేసిన రోటరీ క్లబ్​

By

Published : Jul 14, 2020, 10:56 PM IST

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న వైద్యుల సేవలు ప్రశంసనీయమని... గుంటూరు జిల్లా తెనాలి రోటరీ క్లబ్ సభ్యులు అన్నారు. తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం 2020-21 నూతన కార్యవర్గ సభ్యుల నియామక కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులకు 1 లక్ష 70 వేల విలువ చేసే వెయ్యి పీపీఈకిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శివకుమార్ చేతులు మీదుగా సూపరింటెండెంట్ డాక్టర్ శనత్​కుమారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా వంటి సమయంలో రోటరీ క్లబ్​ వారు ముందుకు రావటం అభినందనీయమన్నారు.

ఇదీ చదవండి:డిప్యూటీ స్పీకర్ పద్మారావు జీ.. మాస్క్ ధరించకపోతే ఎలా?

ABOUT THE AUTHOR

...view details