రాజకీయ కక్షసాధింపే అయితే... కోడెల శివప్రసాదరావు పోరాడేవారనియ... ఆయన ఆత్మహత్య చేసుకునేంత బలహీనుడు కాదని వైకాపా ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. అసెంబ్లీ అధికారులు ఫర్నీచర్ కేసు ఫైల్ చేశారని... ప్రభుత్వం ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై కేసులు పెట్టలేదన్నారు. ఎన్నో కష్టాలను చూసి ఆయన ఆ స్థాయికి వచ్చారన్నారు. శివప్రసాదరావు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు.
'తెదేపా చేసిన అవమానంతోనే కోడెల ఆత్మహత్య' - Kodela Death
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అవమానించడం కారణంగానే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. 2014లో కోడెలకు మంత్రి పదవి ఇవ్వకుండా... స్పీకర్ చేసి... ఆయనతో తప్పులన్నీ చేయించారని రోజా విమర్శించారు. దేశంలో ఏ సభాపతికి లేని విధంగా చెడ్డపేరు వచ్చేలా చంద్రబాబు చేశారని ధ్వజమెత్తారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు.

వైకాపా ఎమ్మెల్యే రోజా
వైకాపా ఎమ్మెల్యే రోజా
చివరి నిమిషంలో చంద్రబాబు అపాయింట్మెంట్ రద్దు చేసినందుకే... కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. జగన్పై బురద జల్లాలనే ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్పై ఎన్నికేసులు పెట్టారని ప్రశ్నించారు. అవన్ని తప్పుడు కేసులని పోరాడి నిరూపించుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు, తెదేపా చేసిన అవమానం భరించలేకే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ... శాసనసభ మాజీ స్పీకర్ కోడెల గత చిత్రాలు