రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని... మితిమీరిన వేగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. లేజర్, రాడార్ స్పీడ్ గన్‌లను వినియోగించడానికి అంగీకరించింది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో... రహదారి భద్రత అథారిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ప్రమాదాల నివారణకు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
రాడార్ స్పీడ్ గన్‌ల ఏర్పాటుతో... ప్రమాదాలకు చెక్..! - news for road safety in ap
రోడ్డు ప్రమాదాల నివారణకు లేజర్, రాడార్ స్పీడ్ గన్‌లను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కొనుగోలుకు రూ.34 కోట్లు ఖర్చు చేయాలని రహదారి భద్రత అథారిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
road-safety-measures-in-ap