ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారి దోపిడీకి పాల్పడిన దుండగులు - గుంటూరు జిల్లా తాజా దారి దోపిడీ వార్తలు

చిలకవారిపాలెం గ్రామ శివారులో ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు దుండగులు... వర ప్రసాద్​ అనే యువకుడిని బెదిరించి అతని వద్దనున్న బంగారు ఆభరణాలు, నగదును దోచుకున్నారు. చరవాణీ తీసుకోవాలని ప్రయత్నించగా... యువకుడు ఎదురు తిరగడం వల్ల అతన్ని గాయపరచి దుండగులు పరారయ్యారు.

road robbery at chilakavaripalem outskirts
దారి దోపిడీకి పాల్పడిన ముగ్గురు దుండగులు

By

Published : Oct 23, 2020, 6:31 PM IST

Updated : Oct 23, 2020, 6:49 PM IST

గుంటూరు జిల్లా నగరం మండలంలో దారి దోపిడీకి పాల్పడి కొందరు దుండగలు ఆభరణాలు, నగదును తీసుకెళ్లారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో రేపల్లె నుంచి కొలగాని వారిపాలెం గ్రామానికి వెళ్తున్న వర ప్రసాద్​(26)ను... చిలకవారిపాలెం గ్రామ శివారులో ద్విచక్రవాహనంపై వచ్చి ముగ్గురు వచ్చి దాడి చేశారు. ప్రసాద్​ చేతిలో, మెడలో ఉన్న బంగారు ఆభరణాలను, నగదును దోచుకెళ్లారు. ఫోన్​ తీసుకోవాలని ప్రయత్నించగా... యువకుడు ఎదురుతిరిగేసరికి కత్తితో చేతిపై పొడిచి ముగ్గురు పరారయ్యారు. అటుగా వస్తున్న స్థానికులు గాయపడిన ప్రసాద్​ను చూసి రేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు చేయగా... రేపల్లె రూరల్​ సీఐ శ్రీనివాస్​ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Last Updated : Oct 23, 2020, 6:49 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details