ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు... ఇద్దరు మృతి - అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం

రాష్ట్ర రహదారులపై.. రక్తం పారింది. 3 జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో 9 మందికి గాయాలు కాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు.

అనంతపురం జిల్లా యర్రచెనుపల్లిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మౌలాలి
అనంతపురం జిల్లా యర్రచెనుపల్లిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మౌలాలి

By

Published : Jan 23, 2021, 11:16 AM IST

  • అనంతపురం జిల్లా యర్రచెనుపల్లిలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మౌలాలి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ మిగతా ఇద్దరిని 108 వాహనంలో కదిరి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. గాండ్లపెంట ఎస్సై గురుప్రసాద్ రెడ్డి కేసు నమోదు చేశారు.
  • నెల్లూరు జిల్లా కావలి బైపాస్ రోడ్డులో రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. మరోవైపు కోవూరు సలుచింతలు వద్ద కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
  • గుంటూరు జిల్లా మెడికొండూరు మండలం పేరేచర్లలో ఓ ఆటోను... కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. భాదితులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మేడికొండూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details