ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారు, బైక్​ ఢీ...ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి - రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందిన విషాదకర ఘటన గుంటూరు జిల్లా వేముులుఉరిపాడు వద్ద జరిగింది. కారు, ద్విచక్రవాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి
ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి

By

Published : May 10, 2021, 3:49 AM IST

గుంటూరు జిల్లా వేముులుఉరిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్రవాహనం ఢీ కొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు విడిచారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..పిరంగిపురం మంటలం తాళ్లూరుకు చెందిన షేక్ చిన మస్తాన్ అతని భార్య నూర్జహాన్, కుమారుడు హుసేన్​తో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై గుంటూరుకు బయల్దేరారు.

వేములఉరిపాడు పరిధిలోని తులసీ సీడ్స్ కంపెనీ వద్దకు చేరుకోగానే గుంటూరు నుంచి నరసరావు పేట వైపు వెళ్తున్న కారు వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా...చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. ఒకే కుంటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details