ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహబూబాబాద్​లో ఘోరం.. గ్రానైట్‌ రాయి ఆటోపై పడటంతో ముగ్గురు మృతి - Mahbubabad news

కోద్దిసేపట్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆ వేడుకలు జరుపుకోవడానికని మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన యువకులు వెళ్తుండగా మృత్యవు కబళించింది. వారు వెళ్తున్న ఆటోపై గ్రానైట్‌ రాయి పడటంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే....

road accident on the national highway at kuravi in mahbubnagar
మహబూబాబాద్​లో ఘోరం.. గ్రానైట్‌ రాయి ఆటోపై పడటంతో ముగ్గురు మృతి

By

Published : Dec 31, 2022, 10:31 PM IST

మహబూబాబాద్‌ జిల్లా కురవి వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీలోని గ్రానైట్‌ రాయి ఆటోపై పడింది. ఈప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటోలో చిన్నగూడూరు మండలంలోని మంగూరిగూడెం నుంచి కురవికి నూతన సంవత్సర వేడుకల కోసం యువకులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

లారీ మహబూబాబాద్‌ వైపు నుంచి మరిపెడ వైపు వెళ్తోంది. కురవి వద్దకు రాగానే రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్‌ రాయి కింద పడిన మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఒకమృతదేహాన్ని వెలికితీశారు. మరో రెండు మృతదేహాలను వెలికితీయాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details