ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రైవర్ పడుకున్నాడు.. బస్సు పల్టీ కొట్టింది

Road accident: డ్రైవర్​ నిద్రమత్తులో వాహనం నడపడంతో బస్తు బోల్తా పడిన ఘటన తెలంగాణలో జరిగింది. గుంటూరు నుంచి హైదరాబాద్​ వస్తున్న వాహనం.. అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9మంది గాయపడ్డారు.

Road accident
బస్సు బోల్తా

By

Published : Dec 13, 2022, 3:29 PM IST

Bus accident in Chityala: తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి జాతీయ రహదారి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి హైదరాబాద్​కు వస్తున్న AR 02-3641 నెంబర్ గల బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. ఈ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వలన వట్టమర్తి వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ప్రమాదానికి గురైంది. బస్సులో ఉన్న ప్రయాణికులలో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నకిరేకల్ కామినేని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details