ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... ఒకరు మృతి - తాడేపల్లిలో మండలంలో రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని... లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ...ఒకరు మృతి
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ...ఒకరు మృతి

By

Published : Feb 20, 2021, 6:28 AM IST


గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని.. లారీ ఢీ కొట్టింది. ఘటనలో మంగళగిరి బాప్టిస్టుపేటకు చెందిన గడ్డం మల్లేశ్వరరావు మృతి చెందగా ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. తాడేపల్లిలోని ఓ సూపర్ మార్కెట్​లో సరుకులు తీసుకొని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

రెండు నెలల వ్యవధిలో..

డిసెంబర్​లో మల్లేశ్వరరావు తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రెండు నెలల వ్యవధిలో ఒకే ఇంటిలో తండ్రి, కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇదీ చదవండి

'నిరంతరం ప్రజలతో ఉంటూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'

ABOUT THE AUTHOR

...view details