లారీని ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. వ్యక్తి మృతి - గుంటూరులో లారీని ఢీ కొట్టిన ద్విచక్రవాహనం
గుంటూరు నగర శివారు పెద్దపలకూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని... ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో పఠాన్ సాబిద్ ఖాన్ అనే యువకుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతి చెందిన పఠాన్ సాబిత్
గుంటూరు నగర శివారు పెద్దపలకూరు వద్ద లారీని.. ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పఠాన్ సాబిత్ ఖాన్ అనే యువకుడు మృతి చెందాడు. సత్తెనపల్లి నుంచి విజయవాడకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పఠాన్ సాబిద్ లారీని ఓవర్ టెక్ చేయబోయి ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న నల్లపాడు పోలీసులు.. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.