ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారు-ద్విచక్రవాహనం ఢీ.. బైక్​ను తప్పించబోయి ఆటో బోల్తా

ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఓ ఆటో లంకలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. గుంటూరు జిల్లా మెడికొండ్రు మండలంలో ఈ ఘటన జరిగింది.

guntur district
కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఐదుగురికి గాయాలు

By

Published : Jul 18, 2020, 7:04 PM IST

గుంటూరు జిల్లా మెడికొండ్రు మండలంలోని జంగంగుంట్ల పాలెం వద్ద కారు-ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. అటుగా వస్తున్న ఆటో ద్విచక్రవాహనాన్ని తప్పించిబోయి పక్కన ఉన్న లంకలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. వారిని ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మెడికొండ్రు పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details