గుంటూరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ కార్మిక పరిషత్ ప్రధాన కార్యదర్శి వరహాలు నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు నుంచి విజయవాడ వస్తున్న సమయంలో కాటూరి ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై కారు బోల్తాపడింది. వాహనం టైరు పేలటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వాహనం పల్టీలు కొట్టి డివైడర్ మీదుగా అవతలి వైపునకు పడిపోయింది.
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ నేతకు తీవ్ర గాయాలు
ఆర్టీసి కార్మిక పరిషత్ ప్రధాన కార్యదర్శి వరహాలు నాయుడు గుంటూరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ నేతకు తీవ్ర గాయాలు
అటుగా వెళ్తున్న వాహనదారులు వరహాలు నాయుడుని కారులో నుంచి బయటకు తీసి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం గుంటూరు రమేష్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. కారు పల్టీలు కొట్టే సమయంలో ఆయన మెడలోపలి వైపు నరం తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందన్నారు.