రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో జరిగింది. గొర్రెపాటి జానీ (80) అనే మహిళ... బేతపూడి గ్రామం రైస్ మిల్ సమీపంలో రోడ్డు దాటుతుండగా.. అదే సమయంలో అటుగా వెళ్తున్న టిప్పర్ లారీ ఆమెను ఢీ కొట్టింది. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జానీ మృతి చెందింది. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి - గుంటూరు జిల్లా లేటెస్ట్ న్యూస్
వృద్ధురాలు రోడ్డు దాటుతుండగా టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో జరిగింది.
road accident