బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి - guntur district crime news
ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం పైనుంచి పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో జరిగింది. రేపల్లె పట్టణానికి పనిమీద వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం పైనుంచి పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. బొందలగరువు గ్రామనికి చెందిన శివరాంప్రసాద్ రేపల్లె పట్టణానికి పనిమీద వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా... అరవపల్లి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో తలకు గట్టిగా దెబ్బతగిలి తీవ్ర రక్తస్రావం అవ్వటంతో శివరాం అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా... ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.