గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా కావలి మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన 14 మంది విశాఖపట్నంలో బంధువుల పుట్టినరోజు వేడుకలకు టెంపో వాహనంలో వెళ్లి తిరిగి వస్తున్నారు.. నాదెండ్ల మండలం గణపవరం వద్దకు వచ్చే సరికి డ్రైవర్ నిద్రమత్తులో ముందుగా వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొట్టాడు... ఈ ప్రమాదంలో టెంపో డ్రైవర్ గంధల్ల వెంకట రవి(35) అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా వట్టూరు గ్రామానికి చెందిన రాసాని శివకృష్ణ(26) చనిపోయాడు.తీవ్రంగా గాయపడిన రాసాని నాగార్జున ,వెయ్యాల హరికృష్ణ ,మచ్చల శేషమ్మ, చాపల హరికృష్ణ ,వెయ్యాల నవీన్ ,ఉప్పలపాటి శ్రీదేవి, రత్నారెడ్డి, వెంకటస్వామీలను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు.
గణపవరం వద్ద రోడ్డు ప్రమాదం.... ఇద్దరు మృతి - 2 people died
గుంటూరు జిల్లా గణపవరం వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదానికి గురయిన కారు