bus accident: డివైడర్ను ఢీకొట్టిన బస్సు...ఏడుగురికి గాయాలు - గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
bus accident: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి సమీపంలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి.
![bus accident: డివైడర్ను ఢీకొట్టిన బస్సు...ఏడుగురికి గాయాలు డివైడర్ను ఢీకొట్టిన బస్సు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13709836-53-13709836-1637640670568.jpg)
bus accident: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి సమీపంలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కడప జిల్లా పొద్దుటూరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు.... ఢివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు అదుపు తప్పినట్లు పోలీసులు తెలిపారు.