గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. నగరంలోని ఏటి అగ్రహారంకు చెందిన సయ్యద్ షరూఫ్(22) చాక్లెట్ల వ్యాపారం చేస్తుంటాడు. అందులో భాగంగా లక్ష్మీపురంలోని ఓ బేకరీలో పనిచేసే తన మిత్రుడు సయ్యద్ అక్బర్(21)ను తోడుగా తీసుకొని ద్విచక్రవాహనంపై ప్రకాశం జిల్లా మార్టూరుకు వెళ్లాడు.
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం...ఇద్దరు మృతి - crime news guntur district
గుంటూరు జిల్లా తాతపూడి 16వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ద్విచక్రవాహనంపై ఇద్దరు యువకులు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది.
పనులు ముగించుకోని తిరిగి ఇద్దరు ద్విచక్రవాహనంపై గుంటూరుకు బయలుదేరారు. ద్విచక్రవాహనం తాతపూడి డొంక వద్దకు చేరుకోగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో వాహనం వెనుక కూర్చున్న అక్బర్, వాహనం నడుపుతున్న షరూఫ్ కింద పడడంతో తల, చాతిపై తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట గ్రామీణ ఎస్సై భాస్కర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన ఇద్దరు యువకుల మృతదేహాలను చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.